వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం (RO) లో అవినీతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ సస్పెండ్ కాగా, తాజాగా జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ రాంనర్సింహారావుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిన డీఐజీ సుభాషిణి, రాంనర్సింహారావుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా కమిషనర్ రాజీవ్ గాంధీ హన్మంతు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.వాస్తవానికి ఈ నెల 10వ తేదీనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.కానీ శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నేడు సోమవారం కార్యాలయం పునఃప్రారంభం కావడంతో, సస్పెన్షన్ కాపీలు అధికారికంగా కార్యాలయానికి చేరనున్నాయి.
వరుసగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ కావడంతో రిజిస్ట్రేషన్ శాఖలో కలకలం రేగుతోంది.








