Sarkar Live

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam

​Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా ‘రైతుబంధు’, ‘రుణమాఫీ’

Rythu Bandhu Scam
  • ​రెవెన్యూ అధికారుల అండతో ఖజానాకు గండి..
  • వరంగల్ జిల్లా ధర్మారంలో వెలుగుచూసిన వైనం


Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా ‘రైతుబంధు’, ‘రుణమాఫీ’ వంటి ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రెవెన్యూ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

​నాలా (NALA) భూమికి పట్టా ఎలా?

​నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మార్చాల్సి ఉంటుంది. గీసుగొండ మండలం ధర్మారం శివారులో సదరు పాఠశాల యజమాని ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఇప్పటికే నాలా అనుమతులు కలిగి ఉన్నారు. అయితే, ఇక్కడే అసలు అక్రమం మొదలైంది. ఆ భూమిని సాగు భూమిగా చూపిస్తూ అప్పటి తహశీల్దార్ పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడం గమనార్హం. రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించడంతోనే ఈ అక్రమ పట్టా సాధ్యమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

​డబుల్ ధమాకా : అటు రైతుబంధు.. ఇటు రుణమాఫీ!

​వ్యవసాయమే జరగని ఆ భూమికి గత కొన్నేళ్లుగా సదరు యజమాని అక్రమంగా ‘రైతుబంధు’ నిధులను పొందుతున్నారు. అక్రమంగా పొందిన పట్టా రికార్డులను బ్యాంకుల్లో కుదువ పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేసిన ‘రుణమాఫీ’ పథకాన్ని కూడా సదరు యజమాని వాడుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యాసంస్థ నడుపుతూ రైతు పథకాలను కొల్లగొట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

Rythu Bandhu Scam : విచారణకు ప్రజల డిమాండ్

​ఈ భూ భాగోతంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు:

​ఎడ్యుకేషనల్ సొసైటీ భూమికి వ్యవసాయ పట్టా ఎలా ఇచ్చారు?

​క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఏళ్ల తరబడి రైతుబంధు నిధులు ఎలా విడుదలయ్యాయి?

​ఈ కుంభకోణంలో సహకరించిన రెవెన్యూ సిబ్బంది, బదిలీపై వెళ్లిన తహశీల్దార్ పాత్ర ఏమిటి?

​అక్రమంగా పొందిన నిధులను తక్షణమే రికవరీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పాఠశాల యజమానితో పాటు, బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?