తెలంగాణలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటూ, ప్రజలకు క్షమాపణలు చెప్పిన కవిత.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ‘కర్కోటకుడు’ అని, తన తండ్రి కేసీఆర్‌ను ‘మరబొమ్మ’ అని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
“ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్”
కవిత తన ప్రసంగంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు.
“ఇది ప్రారంభం మాత్రమే, ఇన్‌ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్ (ముందుంది మొసళ్ల పండుగ). రాష్ట్రంలో ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం స్పందించడం లేదు. అందుకే ఆయన్ను కర్కోటకుడు అంటున్నాను.” — కల్వకుంట్ల కవిత
కేసీఆర్ పై కవిత అస్త్రాలు: “ఆయన మన కేసీఆర్ కాదు”
తండ్రి కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించాయి.
- మరబొమ్మ కేసీఆర్: కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని, ఆయన ఇప్పుడు ఒక మరబొమ్మగా మారిపోయారని విమర్శించారు.
- బందీగా కేసీఆర్: “కేసీఆర్ గుంటనక్క చేతిలో బందీ అయిపోయారు, అందుకే ఇళ్లు కూల్చుతుంటే అమ్మలా రావాల్సిన ఆయన బయటకు రావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
- బీఆర్ఎస్ ఆత్మ: బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
కవిత ‘పాంచజన్యం’ – ఐదు ప్రధాన హామీలు
తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అధికారంలోకి వస్తే చేపట్టబోయే ఐదు కీలక అంశాలను కవిత ప్రకటించారు:
TRS పార్టీ జెండా – ప్రత్యేకతలు
కవిత ప్రకటించిన కొత్త పార్టీ జెండా పాత టీఆర్ఎస్ జెండాను గుర్తుకు తెచ్చేలా ఉన్నప్పటికీ, కొన్ని మార్పులు చేశారు:
- రంగులు: పసుపు, నీలం, తెలుపు.
- డిజైన్: జెండా మొత్తం పసుపు రంగులో ఉండి, మధ్యలో నీలం రంగులో తెలంగాణ మ్యాప్ ఉంది.
- అక్షరాలు: TRS అనే అక్షరాలు తెలుపు రంగులో ముద్రించారు.
బీజేపీకి సవాల్.. తప్పులకు క్షమాపణ!
బీజేపీ ఎంపీలను ‘బానిస ఎంపీలు’ అని విమర్శిస్తూ.. భద్రాచలం వద్ద ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి తీసుకురావాలని కవిత సవాల్ విసిరారు. అదే సమయంలో, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులలో తనకు కూడా భాగస్వామ్యం ఉందని, నేరెళ్ల దళితులపై లాఠీ దెబ్బలు, రైతులకు బేడీలు పడటం వంటి ఘటనలపై బహిరంగంగా క్షమాపణలు కోరారు.








