ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
Kakatiya Mega Textile Park | తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని, వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ (కేఎంటీపీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద 1,327 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.
ప్రపంచస్థాయి సదుపాయాలతో.. ‘పీఎం మిత్ర’లో చోటు
2017లో శంకుస్థాపన జరిగి, ప్రారంభ దశలో నెమ్మదిగా సాగిన ఈ పార్కు పనులు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పథకంలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా ఎంపికైన తర్వాత వేగవంతమయ్యాయి. దేశవ్యాప్తంగా కేంద్రం ఎంపిక చేసిన 7 టెక్స్‌టైల్ పార్కులలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మంజూరైన నిధులతో పార్కులో మౌలిక వసతుల కల్పన ఊపందుకుంది. ప్రధానమంత్రి మోదీ కలల ప్రాజెక్ట్ ‘5 ఎఫ్’ విజన్ (ఫార్మ్, ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) కు ఈ మెగా పార్కు ప్రతిబింబంగా నిలవనుంది.
రూ. 1,695 కోట్ల వ్యయం.. భారీ పెట్టుబడులు
సుమారు రూ. 1,695.54 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో ఇప్పటికే 62 శాతం భూమిని వివిధ పరిశ్రమలకు కేటాయించారు. ఇప్పటి వరకు రూ. 3,842 కోట్ల పెట్టుబడులు రాగా, భవిష్యత్తులో రూ. 6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
కీలక గణాంకాలు & పెట్టుబడులు
- మొత్తం వ్యయం: రూ. 1,695.54 కోట్లతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.
- పెట్టుబడులు: ఇప్పటికే రూ. 3,842 కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, భవిష్యత్తులో ఇవి రూ. 6 వేల కోట్లకు చేరుతాయని అంచనా.
- ఉద్యోగ అవకాశాలు: ఈ పార్క్ ద్వారా మొత్తం 24,400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం 2 వేల మంది ఇప్పటికే పనిచేస్తున్నారు.
Kakatiya Mega Textile Park : మౌలిక సదుపాయాలు
- పార్క్‌లోని 62 శాతం భూములను ఇప్పటికే పలు పరిశ్రమలకు కేటాయించారు.
- విశాలమైన రోడ్లు, వీధి దీపాలు, నీటి సరఫరా కోసం 12 MLD సిస్టం అందుబాటులోకి వచ్చాయి.
- పరిశ్రమల కోసం ప్రత్యేకంగా 232/132/33 KV పవర్ సబ్ స్టేషన్లు, 220 KV ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు చేశారు.
- కాలుష్య నియంత్రణలో భాగంగా 5 MLD సామర్థ్యం గల జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (CETP) ట్రయల్ రన్ జరుగుతోంది.
అధునాతన మౌలిక వసతులు ఈ పార్కులో పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు:
- విద్యుత్: 232/132/33 కేవీ పవర్ సబ్ స్టేషన్లు, 220 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్లు.
- నీటి సరఫరా: 12 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి సరఫరా వ్యవస్థ.
- కాలుష్య నియంత్రణ: ఫేజ్-1లో 5 ఎంఎల్డీ సామర్థ్యంతో ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ కలిగిన సీఈటీపీ (CETP) ట్రయల్ రన్‌లో ఉంది.
- రవాణా: పార్కులో విశాలమైన రహదారులు, మెరుగైన వీధి దీపాల వ్యవస్థ.
24,400 మందికి ఉపాధి ప్రస్తుతం ఈ పార్కులో సుమారు 2 వేల మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే గణేశా ఎకో, యంగ్ వన్ వంటి కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘కైటెక్స్’ సంస్థ తన కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. పూర్తిస్థాయిలో ఈ పార్కు అందుబాటులోకి వస్తే దాదాపు 24,400 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వస్త్ర ఉత్పత్తి, ఎగుమతుల్లో వరంగల్ నగరాన్ని దేశంలోనే ఒక కీలకమైన ‘టెక్స్‌టైల్ హబ్’గా ఈ పార్కు మార్చనుంది.
మామూనూరు విమానాశ్రయానికి మార్గం సుగమం
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వరంగల్ మామూనూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రన్‌వే విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.








