Vanjarapalli Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో అక్రమాల పర్వం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వైనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా, సంగెం మండలం వంజరపల్లిలోని రాజరాజేశ్వర రైస్ మిల్లులో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం గల్లంతైనట్లు తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తే మిల్లర్ భాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది.
నిల్వల్లో భారీ తేడాలు
ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసేందుకు, సివిల్ సప్లై ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. అయితే, మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయింది. అధికారులు కనుక రాజరాజేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహిస్తే(ఫిజికల్ వెరిఫికేషన్) రికార్డుల్లో ఉండే నిల్వలకు మిల్లులో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉంటుంది.
అక్రమాల తీరు ఇలా..
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంతో మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, మిల్లు యజమాన్యం ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.తనిఖీలు జరుగుతాయని తెలిసినప్పుడు ఇతర ప్రాంతాల నుండి ధాన్యం సంచులను తీసుకువచ్చి నిల్వలు సరిగ్గా ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
సదరు రైస్ మిల్లులో గల్లంతైన ధాన్యం విలువ రూ కోటికి పైగానే ఉంటుందని సమాచారం.
వరుస కథనాలతో కదులుతున్న యంత్రాంగం
వరంగల్ జిల్లాలోని పలు రైస్ మిల్లులపై వరుసగా వస్తున్న కథనాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేవలం రాజరాజేశ్వర మిల్లు మాత్రమే కాకుండా, జిల్లాలోని మరికొన్ని కీలక మిల్లుల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోట్లు విలువ చేసే ప్రభుత్వ ధాన్యం మాయం…వామ్మో మిల్లర్ ల లిస్ట్ మాములుగా లేదు కదా.. వరంగల్ జిల్లాలోని మరికొన్ని మిల్లులపై వరుస కథనాలు..








