Sarkar Live

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ఇకపై పీడీ యాక్ట్ అమలు!

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా ‘ఈగల్ ఫోర్స్’ , పోలీస్

DGP CV Anand

Drugs Control Telangana | రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా ‘ఈగల్ ఫోర్స్’ , పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే నిందితులపై పీడీ యాక్ట్ తరహా కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. కేవలం అరెస్టులతోనే సరిపెట్టకుండా, డ్రగ్స్ సరఫరాదారుల ఆస్తులను కూడా సీజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

ముఖ్యంగా విద్యాసంస్థల విషయంలో డీజీపీ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలు, కాలేజీలు లేదా యూనివర్సిటీ ప్రాంగణాల్లో డ్రగ్స్ దొరికితే, దానికి పూర్తి బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. డ్రగ్స్ సరఫరాతో పాటు డిమాండ్ ఉన్న ప్రాంతాలపై కూడా తాము ప్రత్యేక దృష్టి సారించామని, రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జిల్లా స్థాయిలో అధికారుల పనితీరును సమీక్షిస్తూ, డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అలసత్వం వహించకుండా వారికి ఈగల్ ఫోర్స్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

రెగ్యులర్ ట్రాఫిక్‌లోనే కాన్వాయ్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయాలను పరిపాలనలోనూ చూపిస్తున్నారు. తన కాన్వాయ్ రాకపోకల కోసం సామాన్య ప్రజలు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడకూడదని ఆయన తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.

  • నిర్ణయం: సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయొద్దని బుధవారం డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే.
  • అమలు: గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి వెళ్లే సమయంలో సీఎం కాన్వాయ్ ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపలేదు.
  • కొత్త విధానం: ట్రాఫిక్ పోలీసులు వాహనాలను పూర్తిగా నిలిపివేయకుండా, ఒక లేన్‌లో సీఎం కాన్వాయ్‌ను అనుమతిస్తూ ఇతర వాహనాల కదలికలను కొనసాగించారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?