KUDA Mega Venture Shayampet Haveli | వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) సరికొత్త, భారీ లేఅవుట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతిష్టాత్మక మెగా టెక్స్‌టైల్ పార్క్(Kakatiya Mega Textile Park)కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని కుడా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో సాగే ఈ మెగా వెంచర్ స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊపునిస్తోంది.
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు
సాధారణంగా ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ అనగానే రైతుల నుంచి వ్యతిరేకత రావడం చూస్తుంటాం. కానీ, శాయంపేట హవేలి (Shayampet Haveli)లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కుడా లేఅవుట్ వల్ల తమ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో తమకు దక్కే వాటా ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని గ్రహించిన స్థానిక రైతులు.. ఈ వెంచర్ కోసం భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
కుడా ఆధ్వర్యంలో ముగిసిన సర్వే
గీసుగొండ మండలం శాయంపేట హవేలి లో కుడా ఏర్పాటు చేయనున్న భారీ వెంచర్ ((KUDA Mega Venture)) కు ఇటీవలే సర్వే పూర్తిచేసినట్లు సమాచారం.కుడా సర్వేయర్ అన్నపూర్ణ, గ్రామ నివాసి, సర్వేయర్ జి. సదానందం, కుడా ఏపీఓలు శంకర్,శశికల, రిటైర్డ్ తహసీల్దార్ సత్యనారాయణ ల ఆధ్వర్యంలో సర్వే కొనసాగినట్లు తెలిసింది. ఈ సర్వేలో భూములు ఇచ్చే స్థానిక రైతులకు వెంచర్ పై పూర్తి అవగాహన కల్పించడంలో సర్వేయర్ సదానందం కీలక పాత్ర పోషించారు. సర్వేలో అధికారులతోపాటు స్థానిక రైతులు చంద్రమౌళి, నాగరాజు,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
దూసుకెళ్తున్న భూముల ధరలు
కుడా ఇక్కడ భారీ వెంచర్ వేయబోతుందనే వార్తలతో శాయంపేట హవేలి మరియు దాని పరిసర ప్రాంతాల భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. టెక్స్‌టైల్ పార్క్ ఉపాధి అవకాశాలు, ఇప్పుడు కుడా లేఅవుట్ తోడవుతుండటంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాత్రికి రాత్రే ఇక్కడి భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది.
KUDA Mega Venture – వెంచర్ విశేషాలు:
- ప్రాంతం: శాయంపేట హవేలి, గీసుగొండ మండలం (వరంగల్ జిల్లా).
- అనుకూలత: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు అత్యంత సమీపంలో ఉండటం.
- ప్రత్యేకత: ల్యాండ్ పూలింగ్/అభివృద్ధి కోసం రైతుల నుంచి లభిస్తున్న స్వచ్ఛంద మద్దతు.
- అభివృద్ధి ప్రమాణాలు: అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, విద్యుత్ లైన్లతో కుడా లేఅవుట్ రూపకల్పన.
ముగింపు: సకల సౌకర్యాలతో కుడా ఈ భారీ లేఅవుట్‌ను సిద్ధం చేస్తుండటంతో, వరంగల్ నగర శివార్లలో ఇదొక సరికొత్త మోడల్ టౌన్‌షిప్‌గా మారబోతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.








