Sarkar Live

ఆలయంలో చోరీ: 24 గంటల్లోనే అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్!

​•రూ. 2.40 లక్షల విలువైన వెండి సామాగ్రి, కారు స్వాధీనం ​•నిందితుల్లో ఒకరిపై రెండు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు ​•ఆత్మకూర్ పోలీసులను అభినందించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు ​ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్

​•రూ. 2.40 లక్షల విలువైన వెండి సామాగ్రి, కారు స్వాధీనం

​•నిందితుల్లో ఒకరిపై రెండు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు

​•ఆత్మకూర్ పోలీసులను అభినందించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు భారీ చోరీ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. గూడెప్పాడు ఆలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 2.40 లక్షల విలువైన 1080 గ్రాముల వెండి సామాగ్రితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరకాల ఏసీపీ సతీష్ బాబు ఈ కేసు వివరాలను వెల్లడించారు.

​అర్ధరాత్రి దొంగతనం.. టెక్నాలజీతో చెక్!

​ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం ప్రాంతానికి చెందిన కల్లకూరి కిరణ్ బాబు, అనంతపురం జిల్లాకు చెందిన సందీప్ కుమార్ ఇరువురు ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆత్మకూర్ మండల పరిధిలోని గూడెప్పాడు గ్రామంలో గల ఆలయంలోకి చొరబడ్డారు. ఆలయంలోని వెండి సామాగ్రిని దొంగిలించి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆలయ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆత్మకూర్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) ఉపయోగించి నిందితుల కదలికలను వేగంగా గుర్తించారు.

​వాహన తనిఖీల్లో దొరికిపోయిన దొంగలు

​బుధవారం ఉదయం ఆత్మకూర్ మండల కేంద్రంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిందితులిద్దరూ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపిస్తూ దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా గూడెప్పాడు ఆలయంలో తామే చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల్లో ఒకరైన కిరణ్ బాబు అలవాటు పడిన నేరస్థుడని, అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 50కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు పోలీస్ విచారణలో తేలింది.

పోలీస్ సిబ్బందికి అభినందనలు

ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్, రికవరీ టీమ్ మరియు సిబ్బందిని ఏసీపీ సతీష్ బాబు ప్రత్యేకంగా అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?