Sarkar Live

ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ ఆనంద్

•ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదు •తెలంగాణలో మావోయిజం అంతమైందని వ్యాఖ్య •గ్రేహౌండ్స్ విభాగంలో భారీ మార్పులు.. 1700 మంది సిబ్బంది బదిలీగంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి తెలంగాణలో ఇకపై “ఫ్రెండ్లీ పోలీసింగ్” అనే విధానానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రజలకు గౌరవం

•ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదు
 •తెలంగాణలో మావోయిజం అంతమైందని వ్యాఖ్య
 •గ్రేహౌండ్స్ విభాగంలో భారీ మార్పులు.. 1700 మంది సిబ్బంది బదిలీ
గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణలో ఇకపై “ఫ్రెండ్లీ పోలీసింగ్” అనే విధానానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రజలకు గౌరవం ఇస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని, ప్రస్తుతం మావోయిజం అంతరించిపోయిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు.

గ్రేహౌండ్స్ విభాగంలో కీలక మార్పులు చేపడుతున్నామని వెల్లడించిన డీజీపీ, ఆ విభాగంలోని సుమారు 1700 మంది సిబ్బందిని ఇతర కొత్త విభాగాలు, అవసరమైన శాఖలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ తెలిపారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు కఠిన నిఘా కొనసాగుతోందన్నారు.

సైబర్ నేరాలు ప్రస్తుతం పోలీసు శాఖకు పెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్న ఆయన, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలు అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన డీజీపీ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?