Sarkar Live

​ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ​దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు ​గత

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకొని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

​దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు

​గత 19 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా సాగడానికి ఆర్థికంగా, ఇతర రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు.​ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో ​వడ్డేపల్లి భరత్,​గొర్రె చెరాలు,​అప్రధపు సారంగపాణి,​మంతిని చక్రధర్,​పొన్నం కుమారస్వామి,​కామ్మ రామ్మోహన్,​తోట వీరభద్రం,​కొత్తపల్లి శ్రీను​గుడికందుల ప్రగత్,​గుణల మధుతోపాటు  కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?