Solar Panels | సోలార్ రంగంలో అద్భుత ఆవిష్కరణ.. వీటి ఉపయోగం ఏమిటి?
Ultra-thin Solar Panels ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సౌరశక్తి (solar power generation) అనేది దైనందిన చర్యల్లో కీలక వనరుగా మారుతోంది. కాలుష్య రహితంగా సులభమైన పద్ధతిలో అపార విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఈ విధానం ఎంతో వేగంగా విస్తరిస్తూ మరెన్నో విప్లవాత్మక మార్పులతో మనముందుకు వస్తోంది. సోలార్ సిస్టంలో రోజురోజుకూ కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన సోలార్ ప్యానెల్స్ వినూత్న ఆలోచనలకు నిదర్శనంగా నిలుస్తోంది. కాగితంగా కన్నా పలుచటి పరిమాణంతో అతి తక్కువ బరువుతో సోలార్ ప్యానల్స్ (ultra thin solar panels) మార్కెట్‌లోకి రాబోతున్నాయి.
ultra-thin Solar Panels : సాంకేతికత పుట్టిందెక్కడ?
అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ Massachusetts Institute o...




