Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి
warangal

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని 'ఉద్యమ్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు. ​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ​ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు ​తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం. ​ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు. ​మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, ల...
Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
State

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్‌కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం స్పంద...
ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
Crime

ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

అవినీతి అధికారుల వేటలో తెలంగాణ ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. పనులు పూర్తి చేసినా, బిల్లులు ఆపేసి వేధిస్తున్న తీరుపై విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే..? హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ (Storm Water Drain) నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (M-Book) లో వివరాలు నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుసుం సుధాకర్ రెడ్డి చక్రం తిప్పాడు. పని పూర్తి చేసినందుకు 'ఆఫీస్ ఫేవర్' కింద రూ. 50,000 లంచం ఇవ్వాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా...
అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం!  – Minister Seethakka Journey
Special Stories

అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం! – Minister Seethakka Journey

Minister Seethakka Journey | "ఒకప్పుడు అడవి మార్గాల్లో అన్యాయంపై తుపాకీ ఎక్కుపెట్టిన చేతులు.. నేడు అవే అడవి బిడ్డల భవిష్యత్తును మార్చే కలం పట్టాయి. నక్సలైట్ నుంచి న్యాయవాదిగా, పీహెచ్‌డీ స్కాలర్‌గా, ప్రజా నాయకురాలిగా, నేడు రాష్ట్ర మంత్రిగా ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, ములుగు ముద్దుబిడ్డ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానంపై సర్కార్ ప్రత్యేక కథనం." ​బాల్యం ‌‌– పోరాట పథం ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలోని ఒక సాధారణ ఆదివాసీ కోయ కుటుంబంలో 1971, జూలై 9న ద‌న‌స‌రి అన‌సూయ జన్మించారు. చిన్నతనంలోనే గిరిజనుల కష్టాలను, సామాజిక అన్యాయాలను కళ్లారా చూసిన ఆమె, వాటిని ఎదిరించడానికి 14 ఏళ్ల వయసులోనే (1987లో) జనశక్తి నక్సల్ గ్రూపులో చేరారు. అడవిలో దళ కమాండర్‌గా దాదాపు 11 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపిన అన‌సూయ‌ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ...
నిరుద్యోగుల ఆశలపై ‘ఔట్ సోర్సింగ్’ డేగ కన్ను కోట్లు కొల్లగొట్టేందుకు ఏజెన్సీల స్కెచ్! – Outsourcing Jobs Scam
Special Stories

నిరుద్యోగుల ఆశలపై ‘ఔట్ సోర్సింగ్’ డేగ కన్ను కోట్లు కొల్లగొట్టేందుకు ఏజెన్సీల స్కెచ్! – Outsourcing Jobs Scam

Outsourcing Jobs Scam | రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏజెన్సీలకు సంబంధించి అధికారిక ప్రొసీడింగ్స్ వెలువడక ముందే, తెరవెనుక దందా మొదలైనట్లు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ లోని హన్మకొండ, వరంగల్, మహబూబాద్,ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వీరి దందా జోరుగా సాగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఓ ఏజెన్సీ నిర్వాహకుడు "సర్కార్ లైవ్" ప్రతినిధితో అన్నారు. ​పది రోజుల్లో ప్రొసీడింగ్స్.. వెనువెంటనే నియామకాలు ​రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరో పది రోజుల్లో ఎంపిక చేసిన...
error: Content is protected !!