Skip to main content

Sarkar Live

​వ్యాపారాల అభివృద్ధికి ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ తప్పనిసరి: అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని ‘ఉద్యమ్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు. ​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల

చిన్న వ్యాపారమైనా, పెద్ద కంపెనీ అయినా ప్రభుత్వ గుర్తింపు ఉంటేనే మరిన్ని అవకాశాలు లభిస్తాయని, ప్రతి మహిళా పారిశ్రామికవేత్త తన వ్యాపారాన్ని ‘ఉద్యమ్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అదనపు డీఆర్‌డీఓ రేణుకా దేవి పిలుపునిచ్చారు.

​శుక్రవారం గీసుగొండ మండల కేంద్రంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో, అధ్యక్షురాలు గట్టు రాధిక అధ్యక్షతన వీఓఏలకు (VOA) నిర్వహించిన మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి మహిళా ఆదాయాభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్యమ్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

​ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రయోజనాలు

​తక్కువ వడ్డీకే రుణాలు: బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లతో లోన్లు పొందే అవకాశం.

​ప్రభుత్వ చేయూత: ప్రభుత్వ టెండర్లలో ప్రాధాన్యత, వివిధ సబ్సిడీ పథకాలు.

​మార్కెటింగ్ సౌకర్యం: బ్రాండింగ్, లేబులింగ్ మరియు ఆన్‌లైన్ మార్కెటింగ్ లింకేజీలు.

​లైఫ్ టైమ్ వ్యాలిడిటీ:జిల్లా ఈడీసీ మేనేజర్ ఎం. శ్రీలత మాట్లాడుతూ, ఎంఎస్‌ఎంఈ (MSME) ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అవుతుందని, మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆసక్తి గలవారు udyamregistration.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

​ఉచిత సర్టిఫికెట్..

డీపీఎం శంకర్ మాట్లాడుతూ.. సీఐఎఫ్, స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలతో జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం యూబీఐ మేనేజర్ అజయ్ మాట్లాడుతూ, తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని, బకాయి ఉన్న సంఘాలు ఈ నెల 20లోపు క్లియర్ చేయాలని కోరారు.

ఏపీఎం ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ, భారత పౌరసత్వానికి ఆధార్ ఎంత ముఖ్యమో, వ్యాపార అభివృద్ధికి ‘ఉద్యమ్ ఆధార్’ అంత ముఖ్యమని పేర్కొన్నారు. వీఓఏలు ఉచితంగా ఈ సర్టిఫికెట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారని, దీని కోసం ఆధార్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. ప్రక్రియలో భాగంగా వచ్చే ఓటీపీని (OTP) అందించి సభ్యులందరూ ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.

​​ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి శారద, కోశాధికారి శిల్ప, సీసీలు సురేశ్, నర్సయ్య, శ్రీలత, స్త్రీనిధి మేనేజర్ కపిల్, అకౌంటెంట్ జయంతిక, ఆపరేటర్ నాగరాజు మరియు వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?