Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:
Crime

ATM Theft Gang | వరంగల్‌లో ఏటీఎం చోరీల ముఠా గుట్టురట్టు:

ఇనుప రేకులతో మాయాజాలం.. రాజస్థాన్ కేటుగాళ్లు అరెస్ట్! కాజీపేట, డిసెంబర్ 28: ఏటీఎం యంత్రాల్లో చిన్న ఇనుప రేకును అడ్డం పెట్టి, ఖాతాదారులు డ్రా చేసే నగదు బయటకు రాకుండా అడ్డుకుని, ఆ తర్వాత ఆ సొమ్మును కాజేస్తున్న రాజస్థాన్ ముఠాను (ATM Theft Gang) వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిసిఎస్‌ (CCS) మరియు కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.నిందితుల నుంచి రూ. 5,10,000 నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, నేరానికి వాడే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. . నిందితుల వివరాలు : అరెస్టు అయిన వారంతా రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ జిల్లా, మాల్కిడా తాలూకాకు చెందిన ఆరిఫ్ ఖాన్ (23), 2. సర్ఫరాజ్ (24), 3. ఎం. ఆష్ మహ్మద్ (29), 4. షాపుస్ ఖాన్ (33), 5. షారూఖాన్ (33), 6. అస్లాం ఖాన్ (33), 7. ఎం. షారుఖాస్ (27). మరో నిందితుడు ...
Kite Festival 2026 | హైదరాబాద్‌లో త్వ‌ర‌లో భారీ కైట్ ఫెస్టివల్..
State, Hyderabad

Kite Festival 2026 | హైదరాబాద్‌లో త్వ‌ర‌లో భారీ కైట్ ఫెస్టివల్..

హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణ! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు స‌మీక్ష‌ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో కైట్ ఫెస్టివల్‌ (Kite Festival 2026) ను అత్యంత ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైడ్రా చెరువుల వద్ద గాలిపటాల పండుగ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఈసారి కైట్ ఫెస్టివల్‌ను హైడ్రా (HYDRA) ద్వారా పునరుజ్జీవింపబడిన చెరువుల వద్ద నిర్వహించనున్నారు. నగరంలోని నీటి వనరుల పునరుద్ధరణలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించడం, పర్యావరణ స్పృహ కల్పించడం. ఈ వేడుక‌ల ల‌క్ష్యం. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, హైడ్రా తరఫున ప్రత్యేక అధికారులను ...
Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త
State, Khammmam

Khammam | జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి శుభవార్త

10 రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల కోసం జీవో వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల ప్రకటన! Khammam : జర్నలిస్టుల చిరకాల డిమాండ్లు అయిన‌ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్‌ (TWJF) జిల్లా మహాసభలను ఉద్దేశించి ఆయన ఫోన్ ద్వారా ప్రసంగిస్తూ జర్నలిస్టులకు పలు కీలక హామీలు ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డులపై 10 రోజుల్లో జీవో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. రాబోయే పది రోజుల్లోనే అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భర...
Avatar 3 Review Telugu : పండోర ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్.. జేమ్స్ కామెరూన్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
Cinema

Avatar 3 Review Telugu : పండోర ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్.. జేమ్స్ కామెరూన్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

Avatar 3 Review Telugu | 2009లో హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ 'అవతార్' సినిమాను పరిచయం చేసినప్పుడు, ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టారు. ఆ అద్భుతమైన విజువల్స్ చూసి సినిమా ప్రేమికులు మంత్రముగ్ధుల‌య్యారు.. 13 ఏళ్ల తర్వాత వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) ఆ మ్యాజిక్‌ను కొనసాగించింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసారి కామెరూన్ ఏ మేరకు ఆకట్టుకున్నారో ఈ రివ్యూలో చూద్దాం. కథ: అడవి నుంచి నీటిలోకి.. ఇప్పుడు నిప్పు వైపున‌కు! 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ముగిసిన చోటు నుండే ఈ కథ ప్రారంభమవుతుంది. టోరుక్ మక్టోగా పిలవబడే జేక్ సలీ (సామ్ వర్తింగ్టన్) తన కుటుంబంతో కలిసి అడవిని విడిచిపెట్టి 'నీటిని' తమ కొత్త నివాసంగా మార్చుకున్నాడు. అయితే, వారికి పండోరపై పొంచి ఉన్న ప్రమాదాలు ఇంకా తగ్గలేదు. ఈసారి వారికి ఎదురయ్యే అతిపెద్ద ముప్పు '...
Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..
State, Hyderabad

Food Poisoning | క‌ల‌వ‌ర‌పెడుతున్న వ‌రుస‌ ఫుడ్ పాయిజనింగ్ కేసులు.. ఒకే రోజు 66 మంది విద్యార్థులకు అస్వస్థత..

Food Poisoning | హైదరాబాద్: మహానగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో కలుషితాహారం (Food Poisoning) కారణంగా 66 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, మాదాపూర్‌లోని చంద్రానాయక్‌ తండా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనారిటీ గురుకుల పాఠశాలలో 22 మందికి అస్వస్థతకు గుర‌య్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. 22 మంది విద్యార్థినులు (పాఠశాలలో మొత్తం 337 మంది చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో పాడైపోయిన పెరుగు ఇవ్వడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. రాత్రి భోజనం తిన్న తర్వాత విద్యార్థినులకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి మర...
error: Content is protected !!