TIMS Hospitals | రేవంత్ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం
టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్:
సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందించడంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే కవిత్వం లాగ...




