Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..
Dairy Milk Price : దేశంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రభావం పాల ఉత్పత్తులపై కూడా కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాలు, పాలు సంబంధిత ఉత్పత్తులపై పన్ను జీరోకి తగ్గించడంతో వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి.
అమూల్ పాలు
అమూల్ తాజా పౌచ్ పాలపై ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పౌచ్ పాలపై జీఎస్టీ 0 శాతం ఉండటంతో ధరలు అలాగే కొనసాగుతాయి. అయితే అమూల్ టెట్రా ప్యాక్ (UHT milk) పాల ధర మాత్రం తగ్గనుంది. UHT పాలు ఎక్కువ రోజులు ఫ్రిజ్ అవసరం లేకుండా నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటాయి.
మదర్ డెయిరీ పాల ధర లీటరుకు 3 నుండి 4 రూపాయలు తగ్గవచ్చు. అమూల్ టెట్రా ప్యాకెట్ పాల ధర మాత్రమే తగ్గుతుంది. UHT పాలను మీరు చాలా నెలలు ఫ్రిజ్‌లో ఉంచకుండానే ఉపయోగించవచ్చు. UHT ప్రక్రియలో, పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్‌కు ...




