Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లోగో రూపకర్తలు వీరే.. !
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor ) ను ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ తోపాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఆపరేషన్ సిందూర్లో, భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.
పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రతీకార చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, ప్రధానమంత్రి మోదీ ఈ ప్రత్యేక ఆపరేషన్ పేరును 'ఆపరేషన్ సిందూర్' అని సూచించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి (Pahalgam terror attack ) లో భర్తలను కోల్పోయిన మహిళల గౌరవార్థం దీనికి 'ఆపరేషన్ సిందూర్' అనే పేరు పెట్టారు.
'Operation Sindoor' లోగోను ఎవరు రూపొందించారు?
సైన్యం 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించినప్పుడు, దాని లోగో కూడా విడుదల చేశారు. 'ఆపరేషన్ సింధూర్' ల...




