Sarkar Live

ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో భర్త ఒప్పందం!

Morbi Gujarat Crime Landlord Rape | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఇంటి అద్దె బకాయిలు మాఫీ చేయించుకునేందుకు, తన భార్య మరియు మైనర్ కుమార్తెను ఇంటి యజమాని కామవాంఛకు బలిపెట్టాడు. గుజరాత్‌లోని

Morbi Gujarat Crime Landlord Rape

Morbi Gujarat Crime Landlord Rape | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఇంటి అద్దె బకాయిలు మాఫీ చేయించుకునేందుకు, తన భార్య మరియు మైనర్ కుమార్తెను ఇంటి యజమాని కామవాంఛకు బలిపెట్టాడు. గుజరాత్‌లోని మోర్బిలో వెలుగుచూసిన ఈ అత్యంత హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

వలస వచ్చిన కుటుంబంలో దారుణం

పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల కిందట మోర్బి నగరానికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ. 2,000 కిరాయికి ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వ్యక్తి గత నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. దీంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి.

అద్దె బకాయిల కోసం అమానుష ఒప్పందం

ఈ నేపథ్యంలో, పెరిగిపోయిన అద్దె బకాయిలను మాఫీ చేయడం కోసం ఆ వ్యక్తి ఇంటి యజమానితో ఒక అమానుషమైన ఒప్పందం చేసుకున్నాడు. తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై కూడా అత్యాచారం చేసేందుకు ఆ ఇంటి ఓనర్‌కు అనుమతి ఇచ్చాడు. ఈ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుని, సదరు ఇంటి యజమాని ఆ మహిళపై, ఆమె మైనర్ కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వెలుగులోకి తెచ్చిన అత్తగారు.. నిందితుల అరెస్ట్

ఈ దారుణ ఉదంతం బాధితురాలైన మహిళ తల్లికి (బాధిత బాలిక నానమ్మ/అమ్మమ్మ) తెలియడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలిలో ఒకరు మైనర్ కావడంతో పోలీసులు అత్యంత కఠినమైన పోక్సో (POCSO) చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘోరానికి ఒడిగట్టిన కన్నతండ్రి/భర్తతో పాటు, కామాంధుడైన ఇంటి యజమానిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. కాగా, ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?