20న ‘సితారే జమీన్ పర్’ విడుదల – మళ్లీ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ – Sitaare Zameen Par
Sitaare Zameen Par | ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో ఆడియన్స్ ని అలరించే హీరో అమీర్ ఖాన్(Ameer Khan). ఫ్యాన్స్ అందరు మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకొని ఈ హీరో రెండు మూడేళ్లకు ఒక సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. మొదటిసారి బాలీవుడ్లో 100 కోట్లు కొట్టిన మూవీ గజిని(Ghajini). దానికి మించి త్రీ ఇడియట్స్, ధూమ్ 3,పీకే,దంగల్ (Dhangal) ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు.
ఇప్పటికి కూడా దంగల్ మూవీ 2000 కోట్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ చరిత్రలో ఏ మూవీ కూడా ఆ కలెక్షన్లను ఇంతవరకు బ్రేక్ చేయలేదంటే అమీర్ ఖాన్ సత్తా ఏంటో అర్థమవుతుంది. అమీర్ నుండి వచ్చిన గత సినిమా లాల్ సింగ్ చద్దాకి సరైన ఫలితం రాలేదు. దాదాపు 180 కోట్ల తో తీసిన మూవీ 130 కోట్లు మాత్రమే రాబట్టి అమీర్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది.
గత ఫ్లాప్ తర్వాత తిరిగి రీ ఎంట్రీ…
ఆ మూవీ తర్వాత అమీర్ కొద్ది కాల...



