Sarkar Live

వామ్మో శేఖర్.. Revenue Broker ! ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్న ‘సర్కార్ లైవ్’ కథనాలు

​Warangal Revenue Scam | ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఒక పేరు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అదే “రెవెన్యూ బ్రోకర్ (Revenue Broker) శేఖర్”. సామాన్య ప్రజల భూ సమస్యల నుంచి బడా రియల్టర్ల సెటిల్మెంట్ల వరకు

Revenue Broker


Warangal Revenue Scam | ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఒక పేరు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అదే “రెవెన్యూ బ్రోకర్ (Revenue Broker) శేఖర్”. సామాన్య ప్రజల భూ సమస్యల నుంచి బడా రియల్టర్ల సెటిల్మెంట్ల వరకు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ, సమాంతర వ్యవస్థను నడుపుతున్న శేఖర్ లీలలపై ‘సర్కార్ లైవ్’ ప్రచురించిన వరుస కథనాలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

​రెవెన్యూ రాజ్యాంగం.. శేఖర్ కబంధ హస్తం!

ఉమ్మడి వరంగల్ ​జిల్లాలోని ఏ రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్లినా, ఏ టీ స్టాల్ దగ్గర చూసినా ఇప్పుడు ‘శేఖర్’ గురించిన చర్చలే నడుస్తున్నాయి. రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కి, తనకంటూ ఒక ప్రత్యేక ‘రాజ్యాంగాన్ని’ ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ ఆఫీస్ మొదలుకొని కలెక్టరేట్ వరకు శేఖర్ కబంధ హస్తాలు చాచాడని, అధికారులు కూడా అతడి మాటకు తలొగ్గుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి.

​రంగంలోకి నిఘా వర్గాలు

​‘సర్కార్ లైవ్’ కథనాలతో ఒక్కసారిగా యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ రెవెన్యూ దళారీ వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? అతడికి సహకరిస్తున్న అధికారులు ఎవరు? అనే కోణంలో నిఘా వర్గాలు (Intelligence) ఆరా తీస్తున్నాయి. శేఖర్ గడిచిన కొద్ది కాలంలోనే సంపాదించిన ఆస్తులు, జరిపిన సెటిల్మెంట్లపై రహస్య విచారణ చేపట్టినట్లు సమాచారం.

​కలెక్టర్ల ఆరా.. ఎవరై ఉంటారు ఈ శేఖర్?

​వార్తలు తీవ్రతరం కావడంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు సైతం ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.ఎవరా శేఖర్ రెవెన్యూ శాఖకు అతనికి ఏంసంబంధం
​అతడికేమన్నా రెవెన్యూ శాఖలో అధికారిక హోదా ఉందా? లేక ప్రైవేటు వ్యక్తా?​ఏయే అధికారులతో అతడికి లింకులు ఉన్నాయి? అనే అంశాలపై ఉన్నతాధికారులు లోతుగా ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల ఈ బ్రోకర్ శేఖర్ ఏకంగా తానే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ మనిషిని అని చెప్పుకుంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన ఘటనలు కూడా ఉన్నట్లు తెలిసింది.

Revenue Broker : ముందుంది అసలు వేట!

“​సర్కార్ లైవ్” వరుస కథనాల ధాటికి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు సమాచారం. శేఖర్ అక్రమ సామ్రాజ్యం కూలిపోవడమే కాకుండా, అతడి వెనుక ఉన్న ‘పెద్దల’ జాతకాలు కూడా త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఇతగాడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే రెవెన్యూ శాఖలోని అవినీతిని ఇట్టే నిర్మూలించవచ్చని రెవెన్యూ కార్యాలయాల్లో రైతులు మాట్లాడుకోవడం గమనార్హం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?