Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్ రికగ్నేషన్ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది.
తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించనుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది.
బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్రలు చాలావరకు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన...