ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ
ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్
సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల
సర్కార్ లైవ్, సిద్ధిపేట : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాలని...



