గీసుకొండ మండల పరిధిలోని కొమ్మాల గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం గీసుకొండ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు.
ఘటన వివరాలు..
గీసుకొండ మండలం కొమ్మాల గ్రామ శివారులోని కడారి రాజుకు చెందిన వ్యవసాయ భూమిలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై స్పందించిన గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ నేతృత్వంలో పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి దాడి నిర్వహించారు.
పట్టుబడిన నిందితులు:
కడారి రాజు (40), కొమ్మాల
దునికే కొమురయ్య (41), విశ్వనాధపురం
బసికే ప్రభాకర్ (57), కొమ్మాల
లకావత్ గణేష్ (24), విద్యార్థి, విశ్వనాధపురం
పరారీలో ఉన్నవారు: వాంకుడోత్ రాజు, పల్లె నరేష్‌లు పోలీసుల నుండి తప్పించుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుల వద్ద నుండి పోలీసులు భారీగా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు:
నగదు: రూ. 4,840/-
సెల్ ఫోన్లు: 5
మోటార్ సైకిళ్లు: 4
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.








