కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ను ఐనవోలు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి సీనియర్ నాయకులు భాస్కర్ తో కలిసి ఆడెపు విక్రమ్ మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 1100 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, కాకతీయుల కళావైభవం ఉట్టిపడే ఐనవోలు ఆలయాన్ని వారసత్వ సంపద (Heritage Site) గా గుర్తించాలని మంత్రికి విన్నవించారు. దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు విక్రమ్ తెలిపారు.రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని మంత్రి సూచించారు.








