Supreme Court | మేమిప్పుడెందుకు జోక్యం చేసుకోవాలి?.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య
Supreme Court : దేశ రాజకీయం, న్యాయ వ్యవస్థ మధ్య కాంట్రవర్సీ మరోసారి చర్చనీయాంశమైంది. తాజా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) ఈ రోజు చేసిన కీలక వ్యాఖ్యలు (Key Comments) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథంలో అక్కడ రాష్ట్రపతి పాలన (President’s Rule) విధించాలంటూ ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ఆ సమయంలో బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయ్ దీనిపై స్పందిస్తూ 'ఇప్పటికే మాపై కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతిని ఆదేశించమంటారా? ' అని వ్యాఖ్యానించారు.
జస్టిస్ వ్యాఖ్యల వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి?
ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) ఓ కీలక తీర్పులో శాసన సభల ద్వారా రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రాల గవర్నర్లు (Governors), రాష్ట్...




