Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! తప్పుల తడకగా ఇమేజ్ జనరేషన్
Studio Ghibli AI Trend : సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టూడియో గిబ్లీ AI ట్రెండ్ ఊహించని మలుపు తిరిగింది. ఇది సరదాగా మొదలైనప్పటికీ కొంతమందికి భయానకంగా, మరికొంతమందికి వినోదాత్మకంగా మారింది. OpenAI కొత్త ఇమేజ్ జనరేషన్ (AI Image Generation) టూల్‌ను ఉపయోగించి చాలామంది తమ ఫొటోలను గిబ్లీ-స్టైల్ బొమ్మలు (Ghibl Style AI Art)గా మార్చుకుంటున్నారు. అయితే AI కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల విచిత్రమైన ఫలితాలు వస్తున్నాయి.
Studio Ghibli AI Trend : కొబ్బరికాయ బదులు తలకాయ
బీహార్‌లో ముఖ్యమైన పండుగ అయిన ఛఠ్ పూజ (Chhath Puja) జరుపుకుంటున్న మహిళల గిబ్లీ బొమ్మ ఒకటి వైరల్ (Viral AI Image) అయింది. అసలు ఫొటోలో మహిళలు పండ్లు, అగరబత్తులు, కొబ్బరికాయలతో నిండిన బుట్టలను పట్టుకుని నది ఒడ్డున నిలబడి ఉన్నారు. వీటిని సూర్య భగవానుడికి సమర్పించడానికి ఉపయోగిస్తారు. అయితే.. చాట్‌జీపీటీ ఈ చిత్రాన్ని తప్పుగా...




