సీపీ సార్.. కాస్త ‘నీడ’నివ్వండి – గ్రీన్ మ్యాట్ల కోసం వాహనదారుల వేడుకోలు
Warangal Traffic | ఓ వైపు నిప్పులు కురిపిస్తున్న భానుడు.. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ పడగానే సెగలు కక్కుతున్న తారు రోడ్లు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎండల తీవ్రత రోజురోజుకూ మిన్నంటుతోంది. మధ్యాహ్నం 12 దాటిందంటే చాలు, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు.
Warangal Traffic : సిగ్నల్ పడితే ‘నిప్పుల కొలిమే’
నగరంలోని ప్రధాన కూడళ్లయిన హన్మకొండ అదాలత్,పోలీస్ హెడ్ క్వార్టర్స్, అశోక జంక్షన్, ములుగు రోడ్, ఎంజీఎం,వరంగల్ చౌరస్తా,పోచంమైదాన్, హెడ్ పోస్టాఫీస్, కాజీపేట వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వాహనదారులు అల్లాడిపోతున్నారు. 60 నుండి 90 సెకన్ల పాటు ఎండలో వేచి ఉండటం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే వారు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
గత ఏడాది మాదిరిగానే ‘గ్రీన్ మ్యాట్లు’ కావాలి
గతంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ కూడళ్లలో గ్రీన్ షేడ్ నెట్స్ (పచ్చటి పరదాలు) ఏర్పాటు చేసిన విషయాన్ని వాహనదారులు గుర్తు చేస్తున్నారు.ఈ సందర్భంగా వాహనదారులు పోలీస్ కమిషనర్ ను “సర్కార్ లైవ్“ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు.”కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గారు స్పందించి, వెంటనే ప్రధాన కూడళ్లలో గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల సిగ్నల్ పడినప్పుడు కనీసం నీడలో ఉండే అవకాశం ఉంటుంది.”ఎండ వేడికి భయపడి చాలామంది సిగ్నల్ పడకముందే దూసుకుపోవడం లేదా చెట్ల నీడ ఎక్కడ ఉంటే అక్కడే వాహనాలు ఆపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. గ్రీన్ మ్యాట్లు వేస్తే ఈ సమస్య కూడా తప్పుతుందని ప్రజలు భావిస్తున్నారు.చివరగా ”సాబ్.. ఎండలు తట్టుకోలేకపోతున్నాం. గతంలో లాగే పరదాలు కట్టించి మాకు కాస్త ఉపశమనం కలిగించండి.” – నగర వాహనదారులు పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్ ప్రజల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందిస్తారని నగరం ఆశగా ఎదురుచూస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








