Kurnool Accident | 25 మందికి కారణమైన ఘోర దుర్ఘటన ఎలా జరిగింది.?
Kurnool Bus Fire Accident | కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ వోల్వో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 23 మంది సుక్షితంగా బయటపడ్డారు. మిగతా ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏమన్నారు?
ఈ ప్రమాదం రాత్రి 2.45 నుంచి 3 గంటల మధ్య జరిగిందని, ఓ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఇంధన మూత తెరుచుకొని నిప్పురవ్వలు తగిలి మంటలు చెలరేగాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.“...




