Sarkar Live

​Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!

​అర్హతలపై అనుమానాలు.. ప్రమోషన్ వెనుక మతలబు? ​సాధారణ అటెండర్ పోస్టులో చేరిన సదరు ఉద్యోగి, డీఐ స్థాయికి ప్రమోషన్ పొందడం అనేక అనుమానాలను రేకేత్తిస్తోంది.ఈ ప్రమోషన్ కోసం సమర్పించిన విద్యా అర్హత సర్టిఫికెట్లు అసలైనవేనా? లేక దొంగ సర్టిఫికెట్లతో అధికారుల కళ్ళు

Land Scam
  • ​అటెండర్ టు డీఐ ప్రమోషన్ విద్యా అర్హతలపై నీలినీడలు?
  • ​ఎల్కతుర్తిలో సర్వే నెంబర్ మార్పిడికి భారీగా ముడుపులు!
  • ​ముచర్ల చెరువులోని పట్టా భూమి వ్యవహారంలో ‘లకారాలు’ చేతులు మారినట్లు గుసగుసలు

    సదరు అధికారికి కాదేదీ అవినీతికి అనర్హం. చిన్న ఫైలు కదలాలన్నా, పెద్ద భూమి వ్యవహారం చక్కబడాలన్నా అక్కడ ‘ముడుపుల పానీయం’ తాగాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ స్థాయి నుంచి డీఐ (డివిజనల్ ఇన్‌స్పెక్టర్/భూ రికార్డుల తనిఖీ అధికారి) స్థాయికి ఎదిగిన సదరు అధికారి ప్రమోషన్ విద్యా అర్హతలపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలనే పానీ(నీళ్ల)లా మింగేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రెవెన్యూ (Revenue Department), సర్వే శాఖల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఎల్కతుర్తి (Elkathurthi), ముచర్ల (Mucharla)పరిధిలో జరిగిన కొన్ని భూ భాగోతాలు (Land Scam) ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

​అర్హతలపై అనుమానాలు.. ప్రమోషన్ వెనుక మతలబు?

​సాధారణ అటెండర్ పోస్టులో చేరిన సదరు ఉద్యోగి, డీఐ స్థాయికి ప్రమోషన్ పొందడం అనేక అనుమానాలను రేకేత్తిస్తోంది.ఈ ప్రమోషన్ కోసం సమర్పించిన విద్యా అర్హత సర్టిఫికెట్లు అసలైనవేనా? లేక దొంగ సర్టిఫికెట్లతో అధికారుల కళ్ళు గప్పి పదోన్నతి పొందారా? సర్టిఫికెట్ లు అసలైనవే అయితే సదరు అధికారి ఉద్యోగం చేసుకుంటూ కాలేజీకి ఎప్పుడు వెళ్లారని రెవెన్యూ శాఖలో సెటైర్లు వినిపిస్తున్నాయి. సదరు అధికారి సర్టిఫికెట్ లపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపితే అసలు రంగు బయటపడుతుందని మాతృశాఖలోని పలువురు మాట్లాడుకోవడం గమనార్హం.

​ఎల్కతుర్తిలో సర్వే నెంబర్ ‘మాయం’!

​ఎల్కతుర్తి పరిధిలో ఓ సర్వే నెంబరుకు సంబంధించిన భూమిని సుమారు 60 మీటర్ల మేర పక్కకు జరిపినట్లు (మార్చినట్లు) నమ్మశక్యం కాని అక్రమానికి తెరలేపారు. ఈ రీ-సర్వే లేదా మ్యాప్ మార్పిడి ప్రక్రియ వెనుక సదరు డీఐ పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నట్లు గట్టిగా వినబడుతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఈ సర్వే నెంబర్ మార్పిడి గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​ముచర్ల చెరువులో ‘లకారాల’ గిరికీలు!

​ఇక ముచర్ల పరిధిలోని ఒక చెరువు శిఖం/గర్భంలో ఉన్న పట్టా భూమి వ్యవహారంలో సదరు అధికారి చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. నీటి ముంపు లేదా చెరువు పరిధిలోకి వచ్చే భూమికి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు, రికార్డులు మార్చేందుకు సదరు అధికారి వద్ద ‘లకారాలు’ (లక్షల రూపాయలు) చేతులు మారినట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

​పానీలా మింగుతున్న అధికారిపై చర్యలేవి?

నిలువునా అవినీతికి పాల్పడుతూ, అక్రమ సంపాదనను ‘పానీ’లా మింగేస్తున్న సదరు డీఐ గారి లీలలపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి, ఆయన విద్యా అర్హతలపై, అలాగే ఎల్కతుర్తి, ముచర్ల భూ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?