తెలంగాణ రాష్ట్ర పోలీసులు కు డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. హోదాతో నిమిత్తం లేకుండా కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది.
ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యవసర పరిస్థితులు (శాంతిభద్రతల సమస్యలు) ఉంటే తప్ప, సిబ్బంది కోరినప్పుడు యూనిట్ అధికారులు ఈ సెలవులను నిరాకరించకూడదు.
సర్వీస్ రిజిస్టర్లో నమోదైన తేదీల ఆధారంగానే ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయబడతాయి.
నిబంధనలు..
సెలవు కావాల్సిన సిబ్బంది ముందుగానే రాతపూర్వక అభ్యర్థనను తమ పై అధికారులకు అందజేయాలి.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ సెలవుకు మినహాయింపు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విభాగాల పోలీస్ సిబ్బందికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.పోలీసులు తమ విధి నిర్వహణలో ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేస్తున్నారు. ఈ చిన్న విరామం వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని, తిరిగి వారు రెట్టింపు ఉత్సాహంతో విధుల్లో చేరుతారని ఆశిస్తున్నామని డిజిపి శివధర్ రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. పని ఒత్తిడిలో ఉండే తమకు ఇది గొప్ప ఊరటనిస్తుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.








