Telugu Poetry | మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి చేసినా, చెడు చేసినా అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇదే విషయాన్ని ఎంతో అర్థవంతంగా, సరళమైన పదాలతో వివరించారు కవయిత్రి మంజుల పత్తిపాటి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈమె, అటు రాజకీయాల్లో (మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్) ఉంటూనే, ఇటు అక్షర సేద్యం చేస్తూ సమాజానికి హితబోధ చేస్తున్నారు. ఆమె కలం నుండి జాలువారిన ‘కర్మకు కళ్లుంటాయి’ కవిత పాఠకుల కోసం..
మన అడుగులు వేసే దారిలో
మన కర్మలే మన నీడలా నడుస్తాయి… గుర్తుంచుకో..!
మాటలకంటే చేతలతో
మన కథలు రాయబడతాయి…గుర్తుంచుకో..!
ఎవరికి హాని కలిగించకుండా
ఒక చిన్న మంచి సాయము చేయి
నీ కర్మ ఫలము మంచి ఫలితాలను ఇస్తుంది..!
అన్యాయంగా అక్రమ ధారుల్లో
కూడబెట్టిన పైకం నీతో రాదు సరికదా…
నీ కర్మ ఫలము నీ చిట్టా తయారు చేసి
భగవంతుడా ఎందుకు ఈ జన్మ అనే విధంగా
సమస్త రోగాలు నొప్పులను బహుమతి గా ఇస్తుంది..!
చిన్న మొక్క నాటితే చెట్టె నీడను ఇచ్చినట్టు
నీ నుండి చిన్న మంచితనం చినుకై పడితే
పచ్చని జీవితం నీ స్వంతం అవుతుంది..!
ఒక చిన్న తప్పు నీ నుండి మొదలయితే
వడ్డీ చక్రవడ్డి తో కలిపి కర్మ నీకు చెడు రూపంలో
అప్పజెప్పుతుంది..!
కర్మ అద్దం లాంటిది
మన మంచి చెడు చూపిస్తుంది…!
కాబట్టి ఓ మనిషి
పైసా అధికార దాహంతో
పక్కవాడిని తొక్కేయకు…
ఎందుకంటే
నేటి కర్మే… రేపటి నీ విధి అవుతుంది..!’
రచయిత్రి పరిచయం:
- పేరు: మంజుల పత్తిపాటి
- హోదా: కవయిత్రి, మాజీ డైరెక్టర్ (ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ)
- ప్రాంతం: యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
- సంప్రదించాల్సిన నంబర్: 9347042218









