Sarkar Live

TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?

​తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (Kalvakuntla Kavitha TRS Party) పేరుతో కొత్త పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తండ్రి స్థాపించిన నాటి

Kalvakuntla Kavitha TRS Party

​తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ (Kalvakuntla Kavitha TRS Party) పేరుతో కొత్త పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తండ్రి స్థాపించిన నాటి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని గుర్తుచేసేలా ఈ పేరు ఉండటం, పసుపు-ఆకుపచ్చ-నీలం రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించడం ద్వారా ఆమె తన స్పష్టమైన ఉద్దేశాలను చాటారు. అయితే, ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలతో నిండిపోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఈ ‘TRS’కు స్థానం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

​త్రిముఖ పోరులో నాల్గవ పార్టీ నిలదొక్కుకునేనా?

  • ​ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఇలా ఉన్నాయి..
  • రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికలల్లో గెలిచి జోరు మీదుంది.పలురకాల సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
  • రాష్ట్రంలో కేడర్ పరంగా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉంది. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు, కవిత వంటి కీలక నేతలు దూరం కావడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది.
  • జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వంతో పాటు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో త్రిముఖ పార్టీల పోరు కొనసాగుతుండగా ఇప్పుడు నాల్గవ పార్టీగా తెలంగాణ రక్షణ సేన(TRS)తెరపైకి రావడంతో ఈ పార్టీ క్షేత్రస్థాయిలో నిలదొక్కుకుంటుందా లేదా అనే చర్చలు ఊపందుకున్నాయి.

​Kalvakuntla Kavitha TRS Party : వ్యూహం ఏమిటి?

​కవిత తన పార్టీ ద్వారా ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును, సెంటిమెంట్ ఓటర్లను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
​ ‘తెలంగాణ రాష్ట్ర సమితి‘ అనే పేరులో ఉన్న పాత సెంటిమెంట్‌ను ‘తెలంగాణ రక్షణ సేన’ ద్వారా తిరిగి పొందాలని ఆమె భావిస్తున్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై ఆమె చేసిన విమర్శలు, తన తండ్రి (కేసీఆర్) చుట్టూ ఉన్న కొందరు నేతలే పార్టీని నాశనం చేస్తున్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ అసంతృప్త నేతలను ఆకర్షించే విధంగా ఉన్నాయి.ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య, రైతులకు ప్రాధాన్యత, 4 లక్షల ఉద్యోగాలు వంటి హామీలతో యువతను, మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు ప్లాన్ చేశారు.

​సవాళ్లు – స్పేస్ ఎంత?

​రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కొత్త పార్టీకి స్పేస్ ఉండటం అంత సులభం కాదు.కవిత పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ద్వారా కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందా లేక బీఆర్ఎస్ కేడర్ దెబ్బతింటుందా అనేది చూడాలి.తండ్రికి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా ఆమె ఎంతవరకు ప్రజల్లోకి వెళ్లగలరు? ఇది ‘తండ్రి-కూతుళ్ల డ్రామా’ అని విపక్షాలు చేసే విమర్శలను ఆమె ఎలా తిప్పికొడతారు? తెలంగాణ అంతటా పార్టీ యంత్రాంగాన్ని నిర్మించడం భారీ వ్యయంతో కూడుకున్న పని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
​తెలంగాణలో ‘స్పేస్’ ఎప్పుడూ ఉంటుంది, కానీ అది ‘నికరమైన ఓట్లు’గా మారాలంటే కవిత తన పార్టీని కేవలం సెంటిమెంట్‌కే పరిమితం చేయకుండా, ప్రజల సమస్యలపై బలమైన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉండి, కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లడానికి ఇష్టపడని ఒక వర్గం ఓటర్లకు కవిత పార్టీ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?