వరంగల్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ, నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) తన నిబద్ధతతో, అలుపెరగని పోరాట పటిమతో వరంగల్ పశ్చిమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న తీరు అమోఘం.
ప్రజా విజయం.. ఒక తపస్సు ఫలితం
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిలోనూ వెన్నుచూపక, దశాబ్ద కాలం పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నాయినికే చెల్లింది. అధికారం లేనప్పుడు కూడా ఆయన సాగించిన ప్రజా పోరాటాలే, నేడు ఆయనను అసెంబ్లీలో వరంగల్ గళంగా నిలబెట్టాయి.
అభివృద్ధి పథంలో వరంగల్ పశ్చిమ : నాయిని మార్క్ పాలన
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (Warangal West )లోని ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన పెద్దపీట వేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులు, అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తూ నగర రూపురేఖలను మారుస్తున్నారు.
సంక్షేమమే పరమావధిగా,ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందాలనే సంకల్పంతో, ఆయన పారదర్శకమైన పాలనను అందిస్తున్నారు. పైరవీలకు తావులేకుండా, సామాన్యుడికి నేరుగా లబ్ధి చేకూర్చడంలో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. వరంగల్ ఐటీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆయన నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం.
సౌమ్యుడు.. కానీ సమస్యలపై సింహస్వప్నం
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యక్తిత్వం ఎంతో మృదువైనది. కార్యకర్తలను సొంత తమ్ముళ్లలా ఆదరించే గుణం ఆయనది. అయితే, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు లేదా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తే, ఆయన చూపే కఠినత్వం ప్రజా క్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
వ్యూహకర్తగా.. నాయకుడిగా..
కేవలం ఒక నియోజకవర్గ నాయకుడిగానే కాకుండా, పార్టీ బలోపేతంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. క్లిష్ట సమయాల్లోనూ పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి, వరంగల్ జిల్లాలో పార్టీకి తిరుగులేని శక్తిని అందించిన ఘనత ఆయనది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నాయిని రాజేందర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మాటల కంటే చేతలకే ప్రాధాన్యతనిచ్చే ఇటువంటి నాయకత్వం ఉండటం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని,ఆయన నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు








