తెలంగాణ పోలీసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పోలీసులు కు డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. హోదాతో నిమిత్తం లేకుండా కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ ఈ సెలవు వర్తిస్తుంది.
ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం ద్వారా వారిలో పని పట్ల ఉత్సాహం, మనోధైర్యం పెరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అత్యవసర పరిస్థితులు (శాంతిభద్రతల సమస్యలు) ఉంటే తప్ప, సిబ్బంది కోరినప్పుడు యూనిట్ అధికారులు ఈ సెలవులను నిరాకరించకూడదు.
సర్వీస్ రిజిస్టర్‌లో నమోదైన తేదీల ఆధారంగానే ఈ ప్రత్యేక సెలవులు మంజూరు చేయబడతాయి.
నిబంధనలు..
సెలవు కావాల్సిన సిబ్బంది ముందుగానే రాతపూర్వక అభ్యర్థనను తమ పై అధికారులకు అందజేయాలి.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే ఈ సెలవుకు మి...




