Sarkar Live

Rice Mill Scam | రూ. 3 కోట్ల ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు మాల్యా తండా రైస్ మిల్లులో కలకలం!

Maruti Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని మాల్యా తండాలో ఉన్న మారుతీ రైస్ మిల్లులో నిల్వ ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు రూ. 3 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మిల్లులో భద్రంగా ఉన్నాయా? లేదా

Rice Mill Scam

Maruti Rice Mill Scam | వరంగల్ జిల్లాలోని మాల్యా తండాలో ఉన్న మారుతీ రైస్ మిల్లులో నిల్వ ఉండాల్సిన ప్రభుత్వ ధాన్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సుమారు రూ. 3 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మిల్లులో భద్రంగా ఉన్నాయా? లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

​సగానికి పైగా గల్లంతు?

2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మారుతీ రైస్ మిల్లు యాజమాన్యం సుమారు 30 ఏసికే ల సీఎంఆర్ ప్రభుత్వానికి పెట్టాల్సి ఉంది. కానీ సదరు మిల్లులో 30 ఏసికెలకు సరిపడా ధాన్యం నిల్వలు లేవని, సగానికి పైగా నిల్వలు గల్లంతయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.3 కోట్ల ధాన్యంలో 1 కోటికి పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు మిల్లులోని ధాన్యం నిల్వలను చూస్తేనే అర్ధం అవుతుంది.

Maruti Rice Mill Scam

​​Rice Mill Scam | మిల్లులో తనిఖీలకు డిమాండ్

​మారుతీ రైస్ మిల్లులో ప్రస్తుతం ఉన్న నిల్వలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పద్ధతి ప్రకారం జరగాల్సిన ఫిజికల్ వెరిఫికేషన్ (భౌతిక తనిఖీ) నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ​ ప్రభుత్వ సంపద దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, తక్షణమే మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. ​ఈ వ్యవహారంపై సివిల్ సప్లై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?